బ్లాక్ బస్టర్ సినిమాకు ఇదేం కష్టం..! ఒకటికొంటే మరొకటి ఫ్రీ.. మిరాయ్ సినిమా టికెట్స్ పై ఆఫర్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా మిరాయ్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇందులో తేజసజ్జా, మంచు మనోజ్, శ్రియా, రితిక నాయక్ ప్రధాన పాత్రలలో నటించారు. గత రెండు రోజులుగా బాక్సాఫీస్ వసూళ్ల ప్రభంజనంతో దూసుకుపోతుంది.
తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన మిరాయ్ మొదటి రోజే మంచి టాక్ తోపాటు ఓపినింగ్స్ కూడా సాధించింది. రితిక్ నాయక్ ఇందులో హీరోయిన్ గా నటించగా , మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించాడు. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల తార శ్రియా శరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించింది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ సినిమాలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా అదరగొట్టగా.. నెగిటివ్ రోల్‌లో మంచు మనోజ్ మెరిశారు. అలాగే శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం, తంజా కెల్లర్, రాజేంద్రనాత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గౌరా హరి స్వరాలు అందించాడు.
ఇక మిరాయ్ సినిమాకు తెలుగులో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. రెండు రోజుల్లోనే మిరాయ్ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది మిరాయ్. అలాగే విడుదలైన ఇతర భాషల్లోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మిరాయ్ సినిమా టికెట్ కు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనౌన్స్ చేశారు. రెండో రోజు నుంచే ఈ చిత్రానికి ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
