నీవల్లే కదా సినిమా పోయింది ..నాకేం తెలీదంటావేంటి ..?

Spread the love

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 11 గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత లెక్చరర్ పాత్రతో సరిలేరుతో రీ ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత వెన్నెలకిషోర్, సత్యదేవ్ వంటి ఫేమస్ నటులు తెరనిండా కనిపించారు. ఇక సూపర్ స్టార్ ఆర్మీ మేజర్ పాత్రలో అదిరిపోయాడుట. ఆయన ఇంట్రడక్షన్ చూసి ప్రేక్షకులు బొమ్మ బ్లాక్ బస్టర్ అని అనుకున్నారు.

ఫస్టాఫ్ అనిల్ రావిపూడి కి బాగా అలవాటైపోయిన ఫన్ అండ్ కామెడీ తో లాగించినప్పటికి సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లాగడానికి ట్రై చేశాడు

ఇక అన్నిటికంటే ఎక్కువగా ఈ సినిమాని ముంచేసింది రాక్ స్టార్ గా పిలుచుకుంటున్న దేవిశ్రీప్రసాద్. గతంలో మహేష్ కి శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, 1 నేనొక్కడినే వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవి సరిలేరు విషయంలో మాత్రం తన మార్క్ మ్యూజిక్ ని ఇవ్వలేకపోయాడు. గత కొంతకాలంగా చాలా మంది దర్శకులు, హీరోలు పక్కన పెట్టినప్పటికి మహేష్ మాత్రం దేవిని బాగా నమ్మి సరిలేరు కి మంచి ఛాన్స్ ఇచ్చాడు. కానీ అది దేవి నిలుపుకోలేకపోవడమే కాకుండా సరిలేరు నెగిటివ్ టాక్ రావడానికి దేవి ప్రధాన కారణంగా కనిపించాడు. ఒకవైపు థమన్ అల కి ఇచ్చిన మ్యూజిక్ తో సినిమా రేంజ్ అమాంతం పెంచేశాడు. అల కి హిట్ టాక్ రావడానికి సగం థమన్ మ్యూజిక్ అన్న టాక్ వచ్చింది. ఈ రకంగా చూస్తే సరిలేరు కి దేవి పెద్ద మైనస్ అయ్యాడు. అంతేకాదు మహేష్ సరిలేరు రిజల్ట్ విషయంలో నాకేం తెలీనట్టుగా ఉన్నావేంటీ..? అసలు సినిమాకి సగం మైనస్ నువ్వే కదా అంటున్నారని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *