పడిపోయిన సూర్య రేంజ్ ..!!!

Spread the love

సూర్య హీరో గా సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం ” ఎన్ జి కె” తెలుగు వెర్షన్.తెలుగు లో “7జి బృoదవన కాలనీ ” , ‘ ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ‘ చిత్రాలను రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ రాఘవ డైరెక్ట్ చేయడం, సూర్య నటించడం తో. ” ఎ న్ జి కె ” తెలుగు హక్కులు డిమాండు కు ఏర్పడింది.చివరికి వాటిని రాధ మోహన్ సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా 8 కోట్లకు హక్కులు కొన్నట్టు రాధ మోహన్ నిర్మాత చెప్తున్నారు. ఒకప్పుడు సూర్య సినిమా లు హక్కులు 15కోట్ల కు తక్కువ కాకుండా అమ్ముడుపోయేది. ఈ మధ్య వరుస ప్లాప్స్ తో 15 కోట్ల నుంచి 8 కోట్ల కు పడిపోయినది. ఇక మే 31 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నాయికలు గా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *