Puri Jagan to direct Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేలో ఈసినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈమూవీతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నారు పవన్. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుండగా దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈమూవీ ప్రారంభంకానుంది.
కాగా తాజాగా ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో మూవీని అంగీకరించినట్లు తెలుస్తుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను రెడీ చేశారట.
ఇటివలే పూరీ జగన్నాత్ పవన్ కళ్యాణ్ కు కథ వినిపించడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ భద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఈమూవీ తర్వాత పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.