సినిమాల ప్రదర్శనకు అనుమతి

*సినిమాల ప్రదర్శనకు అనుమతి* *సుదీర్ఘకాలం తరువాత తెలంగాణ లో థియేటర్లకు పచ్చజెండా*
హైదరాబాద్: వినోదానికి ‘తెర’లేవనుంది. కరోనా లాక్‌డౌన్‌తో మూతపడిన మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. రాష్ట్రంలో థియేటర్లను తక్షణం తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
సినిమాల ప్రదర్శన సమయంలో ప్రజల ఆరోగ్య భద్రతకు కొన్ని షరతులను కచ్చితంగా పాటించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. * ప్రతి థియేటర్ సీటింగ్ సామర్థ్యంలో 50శాతం వరకే ప్రేక్షకులను అనుమతించాలి.
* కరోనా కంటెయిన్‌మెంట్ ప్రాంతాలకు బయట ఉన్న థియేటర్లే తెరవాలి.
* ప్రేక్షకులే కాకుండా థియేటర్ సిబ్బంది, ఉద్యోగులు, విక్రయ కేంద్రాల్లో పనిచేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అన్ని వేళల్లో మాస్క్ ధరించాలి.
* థియేటర్‌లోకి ప్రవేశించే, వెలుపలికి వచ్చే ద్వారాల వద్ద, కామన్ ఏరియాల్లో చేతుల శుభ్రతకు శానిటైజర్లు పెట్టాలి.
* ప్రేక్షకులు గుంపులుగా చేరకుండా, అందరూ భౌతికదూరం పాటించేలా చూడాలి.
* ప్రతి ప్రదర్శన పూర్తయిన వెంటనే మొత్తం థియేటర్, కామన్ ప్రాంతాలను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి.
* ఎయిర్ కండిషనర్లలో ఉష్ణోగ్రతలు తప్పనిసరిగా 24 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉండేలా చూడాలి.
గాలిలో తేమ 40 నుంచి 70 శాతానికి మించరాదు. స్వచ్ఛమైన గాలి ప్రసరించేలా చూడాలి.
* ఒకే ఆవరణలో ఒకటికి మించి థియేటర్లుంటే వాటిలో సినిమాప్రదర్శన సమయా లు వేర్వేరుగా ఉండాలి. రెండు ప్రదర్శనల్లో విరామాలు ఒకేసారి ఉండకూడదు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
