Teluguwonders:
కశ్మీర్‌లో ఆర్టికల్ రద్దుతోపాటు విభజన తర్వాత కశ్మీర్ అంశం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు దాయాది పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి పిర్యాధు చేసింది. తనకు మద్దతు తెలుపుతున్న చైనాకు పిర్యాధు చేయడంతోపాటు అమేరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సైతం పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో పిర్యాధు చేశారు. దీంతో చాల సంవత్సరాల కశ్మీర్‌పై మరోసారి క్లోజ్‌డ్ డోర్స్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే.. 👉అయితే అత్యవసరంగా జరిగిన సమావేశం అయినప్పటికి యూఎన్ఎసీలో పాకిస్థాన్‌కు ఎలాంటీ మద్దతు లభించకపోవడంతో భారత్‌కు కొంత ఉపశమనం కల్గింది. ఈ నేపథ్యంలోనే మోడీ కశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పెద్దన్న మద్దతు లేకుండా కశ్మీర్ సమస్యకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం లేకపోవడంతో ట్రంప్‌తో ఫోన్ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది.
💥ఫోన్ సంభాషణ దేని గురించి !!:
దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద నిర్మూలన, అంతర్జాతీయ ఉగ్రవాదంతో పాటు, ప్రాంతీయంగా ఉన్న పేదరికం నిరక్షరాస్యత అంశాలపై చర్చించారు. మరోవైపు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు ఇటివల ఒసాకాలో జరిగిన జీ20 దేశాల సదస్సులో చర్చకు వచ్చిన అంశాల పురోగతిపై మాట్లాడారు. 📱సుమారు ముప్పైనిమిషాల పాటు ఇరు దేశాల అధినేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.