ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన అలీ :
ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డ అలీ… ఎట్టకేలకు ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడవచ్చారు . జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.
అలీ మాట్లాడుతూ :
పులివెందుల ముద్దు బిడ్డ, పులి బిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి ఆశయం ఇప్పటికి నెరవేరింది. గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఎదురు చూశారు. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఈ సందర్భంగా మన కొత్త సీఎంకు స్వాగతం పలుకుతున్నట్లు అలీ తెలిపారు.
నవరత్నాలు నవధాన్యాల వంటివి :
తాము కోరుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అవుతుంటే చూసేందుకు ఎన్నో జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడకు రావడం జరిగింది. ఇంటికి నవ ధాన్యాలు ఎంత అవసరమో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్త రాజధానికి ఈ నవరత్నాలు అంతే అవసరం. మొదటి సంతకం నవరత్నాల మీద పెడుతున్న ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఇకపవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చేసరికి :
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, అలీ మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఓ ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చారు. మంచి స్నేహితులుగా ఉన్న వీరు రాజకీయాల కారణంగా విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు.
మే 23న జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోవడం, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలైన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ మద్దతుదారుడైన అలీ ఏం మాట్లాడతారో? ఎలాంటి కామెంట్ చేస్తారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు
అయితే ఆ అంశంపై మాట్లాడటం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది అందుకే అలీ వీలైనంత దూరంగా ఉంటూ వచ్చారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.