February 26, 2026

బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు

IMG-20200721-WA0022.jpg

*బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు: హైకోర్టు*

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించినప్పుడు మాత్రమే నోటాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థి ఒకరున్నా నోటాతో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే బరిలో ఉన్న చోట ఏకగ్రీవంగా ప్రకటించకుండా ఓటర్లు ‘నోటా’ను వినియోగించుకునే అవకాశమివ్వాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భద్ర నాగశేషయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading