OTT Movie: అఫీషియల్.. ఓటీటీలో 235 కోట్ల సస్పెన్స్ థ్రిల్లర్.. దృశ్యంను మించిన ట్విస్టులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 235 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది.
ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్ కు అయితే ఈ వారం పండగే ఎందుకంటే నాని హిట్ 3, సూర్య రెట్రో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఇప్పుడీ లిస్టులో మరో బ్లాక్ బస్టర్ మూవీ చేరింది. ఏప్రిల్ 25 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కేరళలో రూ.100 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా రికార్డుల కెక్కింది. ఇందులోని సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులను చూసి ఇది మరో దృశ్యం అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇలా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. వాస్తవానికి మే మూడవ వారంలోనే ఈ మూవీ ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయిత థియేటర్లలో బాగానే వసూళ్లు సాధిస్తుండటంతో ఓటీటీ సంస్థ దానిని ఒక వారం ముందుకు వాయిదా వేసింది. అంటే మే30న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. దీనిపై తాజా అధికారిక ప్రకటన వెలువడింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
