OTT Movie: పెద్ద హీరో లేడు.. పెద్ద బడ్జెట్ కాదు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. యూత్ పక్కా చూడాల్సిందే..

ఇప్పుడు ఓటీటీ సౌత్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోనూ రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఓ వెబ్ సిరీస్ మాత్రం కట్టిపడేస్తుంది. పెద్ద హీరో లేడు.. పెద్ద బడ్జెట్ కాదు.. అయినప్పటికీ అత్యధిక వ్యూస్ అందుకుంటుంది. ఇంతకీ ఈ సిరీస్ మీరు చూశారా.. ?
ప్రస్తుతం ఓటీటీలో ఒక చిన్న వెబ్ సిరీస్ దుమ్మురేపుతోంది. పెద్ద స్టార్ హీరో, పెద్ద బడ్జెట్ లేకపోయినప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇది ప్రత్యేకమైన వెబ్ సిరీస్. అందుకే ఇప్పుడు జనాలు దీనిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే ఆస్పిరెంట్స్. TVF నిర్మించిన ఈ సిరీస్ ప్రతి యువత చూడాల్సిన వెబ్ సిరీస్. కష్టపడుతూ చదువుకుంటున్న విద్యా్ర్థికి ఈ సిరీస్ ప్రతిబింబమే. UPSC పరీక్షకు సిద్ధమవుతున్న నలుగురు స్నేహితుల జీవితాలు, వారి పోరాటాలు, స్నేహాలు, విడిపోవడం.. జీవితంలో వచ్చే మలుపుల ఆధారంగా ఈ సిరీస్ నిర్మించారు. ఇందులో నవీన్ కస్తూరియా, నమితా దుబే, సన్నీ హిందూజా, శివనిక్త్ సింగ్ పరిహార్ అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ సిరీస్ కు IMDBలో 9.2 రేటింగ్ కలిగి ఉంది.
2012లో ఢిల్లీలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో జరిగిన ఈ సిరీస్ చాలా వాస్తవంగా అనిపిస్తుంది. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు మనం ఆ ప్రాంతంలోనే ఉన్నామనే భావన కలిగిస్తుంది. ఇప్పటివరకు రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్.. భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. నలుగురు యూపీఎస్సీ విద్యార్థులుగా కనిపించిన నవీన్ కస్తూరియా, నమితా దుబే, సన్నీ హిందూజా, శివనిక్త్ సింగ్ పరిహార్ తమ పాత్రలకు ప్రాణం పోశారు.
ఈ సిరీస్ రెండు సీజన్స్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ సీజన్ 3 రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సీజన్ 3 స్టార్ట్ కానున్నట్లు సమాచారం. అంటే ఈ ఏడాది చివర్లో ప్రీమియర్ జరిగే ఛాన్స్ ఉంది. సీజన్ 2లో ఉండే భావోద్వేగాలు, అనేక ప్రశ్నలకు సీజన్ 3లో సమాధానాలు తెలియజేయనున్నారు. నలుగురు స్నేహితులు తాము కోల్పోయిన దానిని తిరిగి నిర్మించుకున్నారా.. ? వారంతా తిరిగి కలుసుకున్నారా ? అనేది వచ్చే సీజన్ లో తెలియనున్నాయి. ఈ సిరీస్ యూత్ తప్పకచూడాల్సింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

Barınaktan, sokaktan ya da gönüllülerden sahiplendirilen sevimli dostlarımız sahipleniyorum.com’da sizi bekliyor. Hayvanseverler için hazırlanan modern arayüzü ve hızlı filtreleme seçenekleriyle aradığınız dostu kolayca bulun.