మనమంతా రోజుకు ఒక ప్యాకెట్‌ సిగరెట్లు కాల్చినట్లే.

0

కాలుష్యాన్ని తీవ్రంగా తీసుకుంటే దిల్లీ ఖాళీ చేయాలి..

హైదరాబాద్‌: ఇంట్లో మనం పెంచుకునే పచ్చని మొక్క లక్ష్మీదేవితో సమానం అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ పేర్కొన్నారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘గాలి కాలుష్యం’ గురించి మాట్లాడారు. గాలి నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని, జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రభుత్వం టపాసుల్ని పూర్తిగా నిషేధించాలని కోరారు.

‘గాలి కాలుష్యం.. చాలా తీవ్రమైన సమస్య. అయినా మనం పట్టించుకోం. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యం నాశనం అయిపోతుంది. గాలి నాణ్యత 0-50 ఉంటే మంచిది, 50-100 ఉంటే మోడరేట్‌. 100-150 ఉంటే అన్‌హెల్తీ, 150-200 ఉంటే వెరీ అన్‌హెల్తీ, 300 దాటితో తీవ్రతరం..

గాలి కాలుష్యం 100కు చేరితే.. ఇంటి కిటికీలు తెరవకూడదు. ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ పెట్టుకోవాలి. బయటికి వెళితే తప్పనిసరిగా మాస్కు వేసుకోవాలి. పిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించకూడదు. పార్కులో ఆడుకోకూడదు, వాకింగ్‌ చేయకూడదు’.

‘అలాంటిది హైదరాబాద్‌లో ప్రతి రోజు సగటుగా 150-200 వరకు కాలుష్యం ఉంటోంది. దీని అర్థం మనమంతా రోజుకు ఒక ప్యాకెట్‌ సిగరెట్లు కాల్చినట్లే. ముంబయిలో గాలి నాణ్యత 200-350 మధ్య ఉంటోంది. దిల్లీలో నాణ్యత 400-800 మధ్య ఉంటోంది. దిల్లీ ఫొటోలు చూశారా.. కాలుష్యంతో నిండిపోయి ఉంది. గాలి, కాలుష్యం కలిసి మందమైన పొరగా ఏర్పడ్డాయి. నిజంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే.. దిల్లీ, చుట్టుపక్కల ఉన్న వాళ్లు వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది’.

’50 శాతం కాలుష్యం పరిశ్రమల వల్ల, 25 శాతం వాహనాల వల్ల, 10 శాతం వ్యవసాయ వ్యర్థాల్ని కాల్చడం వల్ల, 10 శాతం టపాసుల్ని కాల్చడం వల్ల ఏర్పడుతోంది. ఇవి కాకుండా బొగ్గుల పొయ్యిపై వంట చేయడం. ఇండియాలో 100 మిలియన్‌ ఇళ్లలో బొగ్గుల పొయ్యి వాడుతున్నారు. కేవలం బొగ్గుల పొయ్యి మూలంగా ప్రతి ఏడాది 3-4 లక్షల మంది చనిపోతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా బొగ్గు కాలుస్తుంటే ఆపండి. ‘.

‘ప్రపంచంలో తీవ్ర కాలుష్యం ఉన్న నగరాలు 30 ఉంటే.. అందులో 20 మన భారతదేశంలోనే ఉన్నాయి. కాలుష్యం ఇలా ఉంటే మన ఆలోచనలు, ఆరోగ్యం బాగుండదు. రోజంతా చిరాకుగా ఉంటూ నెగటివ్‌ ఆలోచనలతో క్రిమినల్స్‌లా తయారౌతాం. అవుతాం కాదు.. అయ్యాం. కొన్ని వేల సంవత్సరాల వరకు ఈ పండగను దీపాలతోనే జరుపుకున్నాం. బ్రిటిష్‌ దయవల్ల టపాసులు పరిచయం అయ్యాయి. ఇక నుంచి దీపావళికి టపాసులు కాల్చడం ఆపేద్దాం. దీపాలు తప్ప టపాసులు ఉండకూడదు. ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా తీసుకుని టపాసుల్ని నిషేధించాలి. మందుగుండు సామాను పేల్చి.. ఆ కాలుష్యంలో మనం, మన కుటుంబ సభ్యులు నవ్వుతూ కూర్చుంటున్నాం. వాటికి బదులు మొక్కలు కొనండి. ఇంట్లో, ఆఫీసులో మనం మొక్కల పక్కనే కూర్చోవాలి, పడుకోవాలి, ఎవరితోనైనా మాట్లాడాలి.. మీ జీవనశైలిలో మొక్కలు భాగం కావాలి. ఇంటికి వస్తే కూడా మొక్కల మధ్యే ఉండాలి. లక్ష్మీ బాంబ్‌ మనకు ఎందుకు?, మీ ఇంట్లో పచ్చని మొక్క

Leave a Reply