రాజన్న సన్నిధిలో మెగా హీరో అంజన్న దర్శనానికి సాయిధర్మ తేజ్

మెగా హీరో Sai Durga Tej తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో భక్తి పరవశంగా దర్శనం చేసుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకుంటూ, తన కోరికలను నెరవేర్చుకున్నట్లు తెలిపారు. ఆలయానికి చేరుకున్న వెంటనే అర్చకులు వేద మంత్రాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా సాయిధర్మ తేజ్ మాట్లాడుతూ, “ఇక్కడి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. మొదటిసారి రావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.
స్వామివారి దర్శనం తర్వాత ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు.
ఇక మెగా హీరో ఆలయానికి వచ్చిన విషయం తెలిసి అభిమానులు భారీగా చేరుకుని ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా సహకరించడంతో కార్యక్రమం సాఫీగా ముగిసింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
