పెళ్లైన దంపతులు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది..

ఓటీటీలో ఓ కొత్త సినిమా తుఫానులా దూసుకుపోతుంది. ఇప్పుడు ఆ మూవీ టాప్ 10లో మొదటి స్థానంలో నిలిచింది. ఇది బాక్సాఫీస్ వద్ద 300 % కంటే ఎక్కువగా లాభాలను ఆర్జించింది. అంతేకాదు.. ఫ్యామిలీ అడియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ ఏంటో తెలుసా.. ?
కథ విషయానికి వస్తే.. పరోటా మాస్టర్ అయిన ఆగస వీరన్ (విజయ్ సేతుపతి) విద్యావంతురాలైన, ధైర్యవంతురాలైన పెరారసి (నిత్య మీనన్) చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఇద్దరు భార్యభర్తలు. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి జీవితంలో అనుకోని సంఘటనలతో మనస్పర్థలు తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు.. అహంకారాలతో సాగుతుంది. అపార్థాలు ఉన్నప్పటికీ ప్రేమ ఎలా భరించగలదో ఈ సినిమా ద్వారా చూపించారు.
కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 126 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. పాజిటివ్ రివ్యూస్ రావడంతో ఈ సినిమా చూసేందుకు జనాలు క్యూ కట్టారు. ఎప్పుడూ విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకునే విజయ్.. మరోసారి ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పుడు టాప్ 10 ట్రెండింగ్ చిత్రాలలో మొదటి స్థానంలో నిలిచింది.
