తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. సీఎం రేవంత్, ప్రధాని సహా పలువురి శుభాకాంక్షలు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ పురోగతికి తెలంగాణ కృషి చేసిందన్నారు. తెలంగాణ ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు.. దశాబ్ద కాలంగా ఎన్డీఏ అనేక చర్యలు చేపట్టిందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు
ప్రజలంతా కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలను ఈ సందర్బంగా స్మరించుకున్నారు సీఎం.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని.. ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి మార్గంలో ముందుకుసాగాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి
— తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ పురోగతికి తెలంగాణ కృషి చేసిందన్నారు. తెలంగాణ ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు.. దశాబ్ద కాలంగా ఎన్డీఏ అనేక చర్యలు చేపట్టిందన్నారు ప్రధాని మోదీ.
— పదకొండేళ్ల క్రితం మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీ నాయకత్వంలో.. తెలంగాణ రాష్ట్రం పురుడుపోసుకుందన్నారు రాహుల్‌గాంధీ. కోట్ల మంది ప్రజల ఆశలు, కలలకు కాంగ్రెస్ ఒక రూపాన్ని ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అంటూ ట్వీట్ చేశారు రాహుల్.
— రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, జాతి ఒక్కటే అంటూ.. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలని కోరారు. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు ఏపీ సీఎం చంద్రబాబు.
— జనసేనకు జన్మనిచ్చిన నేల..తనకు పునర్జన్మనిచ్చిన నేల.. తన ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. తెలంగాణ 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు పవన్
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
