ఈ రోజు ప్రధాన నగరాలలో వెండి , బంగారం ధరలు..

Teluguwonders:
పసిడి ధర స్వల్పంగా పైకి చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 1,505 డాలర్ల సమీపంలో కిందకు కదిలింది .
పసిడి మళ్లీ పరిగెత్తింది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పగా పెరిగితే గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం పసిడి పడిపోయింది. మరోవైపు ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.
అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
🔴వివరాల్లోకి వెళ్తే :
శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల
బంగారం ధర 👉హైదరాబాద్ మార్కెట్‌లో :
కేవలం రూ.10 పెరుగుదలతో రూ.39,290కు చేరింది.
👉ఢిల్లీ మార్కెట్‌లో :
పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ.38,400 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా రూ.37,200 వద్ద స్థిరంగా ఉంది. 👉ఇక కేజీ వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ.350 పెరుగుదలతో రూ.47,850కు చేరింది.
👉అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,020కు చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.350 పెరుగుదలతో రూ.47,850కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.
💥విజయవాడ, విశాఖపట్నంలో కూడా :
ధరలు ఇలానే ఉన్నాయి.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.20 శాతం తగ్గుదలతో 1,505.35 డాలర్లకు క్షీణించింది. 👉అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.31 శాతం క్షీణతతో 16.98 డాలర్లకు తగ్గింది.
💥ప్రభావం చూపే అంశాలు :
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
