Tik tok యాప్ మరొకరిని చంపేసింది…

Untitled design - 2019-06-05T142208.907

ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన కొన్ని యాప్ లు..కొంత మందిని యమ లోకానికి పంపేస్తున్నాయి.
🔴Tik tok :
టిక్‌టాక్.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ తనకు బందీ చేసుకొంది. నిజంగా చెప్పాలంటే.. ఎంతో మంది జీవితాలను కూల్చివేసింది.

👉విషయం ఏమిటంటే : టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలతో వీడియోలు చేస్తోందని కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. వెలినగర్‌ ప్రాంతానికి చెందిన కనకరాజు(35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతడికి నందిని(28) భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవ కారణంగా ఇద్దరు విడిపోయి ఉంటున్నారు. నందిని తన ఇంటికి దగ్గరలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తోంది. అయితే, నందిని టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలు చూపుతూ పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఇది తెలుసుకున్న కనకరాజు ఆమెకు ఫోన్ చేసి మందలించాడు. టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మానేయాలని, కాపురానికి వచ్చి బుద్ధిగా ఉండాలని హెచ్చరించాడు. అది పట్టించుకోకుండా నందిని ఫోన్ కట్ చేసింది. మళ్లీ ఫోన్ చేస్తే బిజీ వచ్చింది.

🔴కళాశాల లొనే హత్య: దీంతో కోపంతో ఊగిపోయిన కనకరాజు.. అదే రోజు ఫుల్లుగా మందేసి నందిని పనిచేస్తున్న కళాశాల వద్దకు వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. వారిద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఆవేశానికి గురయ్యాడు. తనతో తీసుకెళ్లిన కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన నందినిని సహచర ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights