Tollywood: రోడ్డుపై పెన్నులు అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు రూ.250 కోట్లకు అధిపతి.. ఇండస్ట్రీలో ఫేమస్ కమెడియన్.. ఎవరంటే.

తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో చిన్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలను దగ్గరుండి చూశాడు. స్కూల్ ఫీజులు కట్టడానికి తగినంత డబ్బు లేదు. దీంతో చదువు కోసం వీధుల్లో పెన్నులు అమ్మాడు. ఆ తర్వాత తనకు వచ్చిన పని చేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే పాపులర్ కమెడియన్. ఏకంగా రూ.250 కోట్లకు అధిపతి అయ్యాడు. ఇంతకీ అతడు ఎవరంటే..
సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సహజ నటనతో, తనదైన కామెడీ పంచులతో కట్టిపడేశాడు. తెలుగు ఫ్యామిలీకి చెందిన అతడు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు, కష్టాల్లోనే గడిపాడు. కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. పూణే వీధుల్లో పెన్నులు అమ్మాడు. అప్పుడే నటనపై ఆసక్తి ఉండడంతో.. సినీరంగంలోని పలువురు తారలను మిమిక్రీ చేసేవాడు. అలాగే హిందీ పాటలకు తన స్టై్ల్లో డ్యాన్స్ చేస్తూ అలరించేవాడు. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో పాపులర్ కమెడియన్ గా మారాడు. అతడి ఆస్తులు రూ.250కోట్లకు పైగా ఉంటుంది. అతడు ఎవరో తెలుసా.. హిందీ సినీరంగంలో పాపులర్ అయిన జానీ లివర్.
జానీ లివర్.. అచ్చ తెలుగు ఫ్యామిలీ. తండ్రి మద్యానికి బానిస కావడంతో చిన్నప్పటి నుంచి ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. 13 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బీర్ బైసెప్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 13 ఏళ్ల వయసులోనే తాను చనిపోవాలనుకున్నానని.. అందుకే రైల్వే ట్రాక్ కు వెళ్లానని అన్నారు. కానీ తన ముగ్గురు చెల్లెళ్లు గుర్తుకు వచ్చి వెంటనే ట్రాక్ నుంచి దూరంగా పారిపోయానని అప్పటి రోజును గుర్తుచేసుకున్నారు. నిజ జీవిత అనుభవాల నుంచే కామెడీని పుట్టించాడు. తాను ఇప్పుడున్న విధంగా మారడానికి చిన్నప్పటి నుంచి తాను చేసిన పోరాటమే అని ఎప్పుడూ చెబుతుంటారు.
హిందీ భాషలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు జానీ లివర్. బాజీగర్, తేజాబ్, ఖిలాడీ, కరణ్ అర్జున్, రాజా హిందుస్తానీ, కహో నా ప్యార్ హై, కబీ ఖుషీ కభీ ఘమ్, నాయక్, కూలీ నంబర్ 1 వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలోనే టాప్ కమెడియన్. అతడి ఆస్తులు రూ.250 కోట్లు. ప్రస్తుతం ముంబైలో 3 BHK ఇల్లు కలిగి ఉన్నాడు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
