వాహనదారులకు అలర్ట్.. రేపు ఈ రూట్లో రాకపోకలు బంద్..

independenceday
దేశవ్యాప్తంగా రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 79వ ఉత్సవాల కోసం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని రహదారులను మూసివేసి, మరికొన్ని మార్గాలను మళ్లించారు. అలాగే, గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో నివసించే వారు తమ వాహనాలను రహదారులపై పార్క్ చేయకుండా ఉండాలని సూచించారు.
రేపు రాకపోకలు నిలిపివేత
ఆగస్టు 15 ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహన రాకపోకలను రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేస్తారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, పోలీసులు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులు
సెవెన్ టూంబ్స్ నుంచి వచ్చే వాహనాలను జమాలి దర్వాజా వైపు మళ్లిస్తారు.
GHMC గ్రౌండ్, GHMC ఐల్యాండ్ నుంచి వచ్చే వాహనాలను మోతీ మహల్ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు.
బడా బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను GHMC ఐల్యాండ్ వైపు పంపిస్తారు.
నార్సింగి, టిప్పు ఖాన్ వంతెనల నుంచి వచ్చే వాహనాలను రాందేవ్‌గూడ జంక్షన్ వద్ద మళ్లిస్తారు.
పార్కింగ్ ఏర్పాట్లు
వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాలా హిస్సార్ మరియు బడా బజార్ మసీదు మధ్య పార్కింగ్.
ప్రభుత్వ సీనియర్ అధికారులకు గోల్కొండ బస్ స్టాప్ వద్ద.
ఇతర ప్రముఖులకు ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద.
మీడియా, అవార్డు గ్రహీతలకు ఏరియా హాస్పిటల్ వద్ద.
సాధారణ ప్రజలకు సెవెన్ టూంబ్స్, డెక్కన్ పార్క్, హుడా పార్క్‌లలో పార్కింగ్ సౌకర్యం.
పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. సహాయం కోసం 90102 03626 హెల్ప్‌లైన్ నంబర్ అందుబాటులో ఉంచారు. వర్షాల అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Share this:
- Click to share on X (Opens in new window) X
- Click to share on Facebook (Opens in new window) Facebook
- Click to share on Reddit (Opens in new window) Reddit
- Click to share on Pinterest (Opens in new window) Pinterest
- Click to share on WhatsApp (Opens in new window) WhatsApp
- Click to share on LinkedIn (Opens in new window) LinkedIn
- Click to share on Tumblr (Opens in new window) Tumblr
- More
Related
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
