Turmeric Water: వామ్మో.. పసుపు నీళ్లు తాగుతున్నారా..? ఇక మీ బాడీ షెడ్డుకే!

turmeric-water

ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధపెడుతున్నారు. ఇందుకోసం కొందరు వైద్యులకు బదులుగా ఇంటర్నెట్‌ నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉదయం ఖాళీ కడుపుతో ఇది తాగండి, ఇది తినండి, అది తినండి అని తెగ చెప్పేస్తున్నారు. వీటిలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నది పసుపు కలిపిన వేడి నీరు తాగమనడం. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకో తెలుసుకుందాం పదండి.

ఈ మధ్య సోషల్‌ మీడియా, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్‌ ఇచ్చే చిట్కాలను చాలా మంది గుడ్డిగా ఫాలో అవుతున్నారు. దీని వల్ల కొన్ని సార్లు అనారోగ్యం బారీన కూడా పడుతున్నారు. ఇలా ఫాలో అయ్యే వాటిలో ఇప్పుడు ఎక్కవ మంది పాటిస్తున్నది. ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలుపుకొని తాగడం. ఇలా తాగడం ఆరోగ్యానికి హానికరమణి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపులోని అద్భుతమైన మూలకం ‘కర్కుమిన్’ మన శరీరంలో మంటను తగ్గిస్తుంది, క్యాన్సర్‌తో పోరాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మానికి మెరుపును ఇస్తుంది. ఇలా పసుపు వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిని సరైన పద్దతిలో పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇక్కడ పెద్దలు చెప్పిన.. అతిగా తీసుకుంటే అమృతం కూడా తాగితే విషమే” అనే సామెతను మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదని భావించే పసుపు నీటిని ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరానికి మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఈ సంజీవిని పసుపు నీరు వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? చూద్దాం

పసుపు నీటి వల్ల కలిగే 5 దుష్ప్రభావాలు

పసుపు జీర్ణక్రియకు మంచిదని అంటారు. నిజమే. అయితే, అధికంగా తీసుకుంటే, అదే పసుపు కడుపు నొప్పి, గ్యాస్, గుండెల్లో మంట, వికారం, విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. రోజు ప్రారంభంలో మీ కడుపు బాగా లేకపోతే, మీరు రోజంతా చిరాకుగా ఉంటారు. కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో పసుపు నీటిని తాగే ముందు ఒకసారి ఆలోచించండి

రక్తస్రావం ప్రమాదం: పసుపు రక్తాన్ని పలుచబరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గుండెకు మంచిది. అయితే, మీరు ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులను తీసుకుంటుంటే లేదా రక్తస్రావం సమస్య ఉంటే, పసుపు నీరు మీకు ప్రమాదకరం కావచ్చు.

కాలేయంపై ప్రభావం: మితంగా తీసుకుంటే కాలేయాన్ని శుభ్రపరిచే పసుపు, అధికంగా తీసుకుంటే కాలేయానికి హాని కలిగిస్తుందని కొన్ని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే పిత్తాశయంలో రాళ్లు లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించకుండా పసుపు నీరు తాగకూడదు.

అలెర్జీ: కొంతమందికి పసుపు అలెర్జీ ఉండవచ్చు. మీరు పసుపు నీటిని తాగడం ప్రారంభించినప్పుడు.. మీ చర్మంపై ఎర్రటి గడ్డలు, దద్దుర్లు లేదా దురదను అనుభవిస్తే, వెంటనే దానిని తాగడం మానేయండి. ఇది పసుపు అలెర్జీకి సంకేతం కావచ్చు.

గమనిక: మీరు పసుపు నీరు తాగకూడదా? అంటే తప్పకుండా తాగవచ్చు. కానీ, ఒక మొతాదులో తాగండి. ఒక గ్లాసు వేడి నీటిలో చిటికెడు (పావు టీస్పూన్ కంటే తక్కువ) స్వచ్ఛమైన పసుపు పొడిని కలిపి త్రాగండి. ఏదైనా కొత్త ఆరోగ్యకరమైన అలవాటును ప్రారంభించే ముందు, ముఖ్యంగా మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights