February 26, 2026

అయోధ్యలో మసీదు లోగో విడుదల

wp-15985166509912083862206592247901.jpg

*అయోధ్యలో మసీదు లోగో విడుదల* దిల్లీ: దశాబ్దాల కాలం పాటు దేశ రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం సద్దుమణగడంతో రామమందిరం నిర్మాణంతో పాటు ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మాణానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటికే మసీదు నిర్మాణ ఏర్పాట్లు ప్రారంభించిన ఇండో-ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ (ఐఐసీఎఫ్‌) తాజాగా మసీదు లోగోను విడుదల చేసింది. యూపీలోని అయోధ్యకు దాదాపు 20కి.మీల దూరంలోని ధన్నీపూర్‌ గ్రామంలో ఐదెకరాల స్థలంలో మసీదుతో పాటు కమ్యూనిటీ కిచెన్‌, ఆస్పత్రి, రీసెర్చి సెంటర్‌ ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నారు. బహుభుజి ఆకృతిలో ఉన్న ఈ లోగో హుమయూన్‌ సమాధిలో ఉపయోగించిన క్లిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇండో- ఇస్లామిక్‌ సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.

అలాగే, ప్రపంచంలోని బహుళ సంస్కృతుల వారసత్వానికి ప్రతీకగా ఉంటుందని ఫౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading