April 4, 2026

ఇరాన్‌లో కూలిన అమెరికా జెట్‌లు.. పైలట్ల కోసం అలర్ట్

09cbbc09-83b3-48bb-a92d-66b44535ebca

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. తాజాగా ఇరాన్, అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ ఘటనలో విమానాలను నడిపిన పైలట్లు ఎజెక్ట్ అయి భూమిపై దిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఆ పైలట్లను పట్టిస్తే భారీ బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. సజీవంగా పట్టుకుని అధికారులకు అప్పగిస్తే సుమారు 60 వేల డాలర్ల బౌంటీ ఇస్తామని వెల్లడించింది. మరోవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ, పైలట్లు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది.

ఇరాన్ మీడియా ప్రకారం, కూల్చివేత జరిగిన ప్రాంతానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే పైలట్లకు హాని చేయవద్దని ఇరాన్ సాయుధ దళాలు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.

ఇదిలా ఉండగా, ఎఫ్-35, ఎఫ్-15 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా ఈ దాడిలో దెబ్బతిన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading