Viral Video: స్కూల్ బస్సు దిగిన చిన్నారికి వెల్కం చెప్పిన కుక్కలు.. Z+ భద్రతా వలయంగా ఏర్పడి రక్షణ.. క్యూట్ వీడియో వైరల్

ఒక స్కూల్ బస్సు ఆగింది. ఒక చిన్నారి బాలిక ఆ బస్సు నుంచి కిందకు దిగగానే కుక్కల గుంపు ఆ బాలిక కోసం పరిగెత్తుకుని వెళ్ళాయి. దీని తరువాత కుక్కలు బాలిక చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పరిచాయి. ఆ బాలికకి ఇరు వైపులా సెక్యురిటీ గార్డ్స్ లా ఎవరూ ఊహించని విధంగా కేరింగ్ తీసుకున్నాయి. ఈ ఫన్నీ వీడియోను చూస్తే.. ఎంత చికాకు అయినా ఇట్టే మాయం అవుతుంది.
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ చాలా అందమైన క్షణం ఇదే అనిపిస్తుంది. ఇది నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియోలో ఒక స్కూల్ బస్సు వస్తోంది.. ఆ బస్సు నుంచి ఒక చిన్న అమ్మాయి దిగుతోంటే.. ఆమెను స్వాగతించడానికి ఇప్పటికే కుక్కల గుంపు ఉంది. దీని తరువాత అన్ని కుక్కలు బాడీగార్డ్‌ల మాదిరిగా అమ్మాయి చుట్టూ Z+ భద్రతా వలయంగా ఏర్పడ్డాయి.
ఈ వైరల్ వీడియోలో చిన్నారి బాలిక వచ్చే స్కూల్ బస్సు కోసం పొలం దగ్గర చాలా కుక్కలు వేచి ఉన్నాయి. స్కూల్ బస్సు ఆగిన వెంటనే.. పొలంలో దగ్గర ఉన్న అన్ని కుక్కలు ఆ బస్సుకి దగ్గరగా పరిగెత్తాయి. ఆ బస్సు నుంచి ఒక చిన్నారి బాలిక దిగగానే కుక్కలు ఆమెను చుట్టుముట్టి భద్రతా వలయంగా ఏర్పడ్డాయి. బాలిక స్కూల్ బ్యాగ్‌ను వీపుకి వేసుకుని.. తన ఇంటి వైపు నడవడం ప్రారంభించింది. ఆమె నమ్మకమైన కుక్కలు ఆమెతో పాటు పరిగెట్టడం మొదలు పెట్టాయి.
ఈ వీడియోను నెటిజన్లు చాలా ఇష్టపడ్డారు. ఈ అమ్మాయి సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రజలు అంటున్నారు. ఒక యూజర్ దీనిని చూసి చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మరొకరు ఇంటర్నెట్‌లో అత్యంత అందమైన వీడియో అని రాశారు. మరొకరు మనుషులు ఈ అమాయకమైన, విశ్వాసం గల జంతువుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని సూచించారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
