Viral Video: దొంగల ప్లాన్ అట్టర్ ప్లాప్.. షాపులోకి రాగానే కనిపించకుండా పోయారు.. ఫాగింగ్ యంత్రంతో బెడిసికొట్టింది!

Viral Video: దుకాణంలో దొంగతనం చేయబోయిన దొంగల ప్లాన్ బెడిసికొట్టింది. రాత్రిపూట షాపులోకి చొరబడిన తర్వాత, అనుకోకుండా ఫాగింగ్ యంత్రం ప్రారంభమైంది. దీంతో షాపు మొత్తం పొగతో నిండిపోయింది, దొంగలు కళ్ళు కనిపించక, ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. చోరీ ప్రయత్నం విఫలమవడంతో భయంతో పారిపోయారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, నెటిజన్లు నవ్వుకుంటున్నారు..
Viral Video: సోషల్ మీడియాలో ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో రాత్రి సమయంలో కొంతమంది దొంగలు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక పెద్ద దుకాణంలోకి చొరనబడ్డారు. అంతా వారి పథకం ప్రకారం జరుగుతుండగా, దుకాణంలో ఏర్పాటు చేసిన ఫాగింగ్ యంత్రం అకస్మాత్తుగా పనిచేయడం ప్రారంభించింది. దుకాణం మొత్తం పొగతో నిండిపోయింది. ఇంకేముంది దొంగలకు ఆ ఫాగింగ్ పెద్ద అడ్డంకిగా మారింది. దొంగలు అలసిపోయిన స్థితిలో మిగిలిపోయారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
బెడిసికొట్టిన దొంగతనం
వీడియోలో దొంగలు దుకాణంలోకి ప్రవేశించిన తర్వాత చోరీకి ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఒక యంత్రం దట్టమైన పొగను విడుదల విడుదల చేయడంతో వారి ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది.ఆ ఫాగింగ్ యంత్రం వల్ల దుకాణం మొత్తం క్షణాల్లో తెల్లటి పొగతో నిండిపోయింది. దీంతో వారు దొంగతనం చేసేందుకు ఏమి తోచలేదు. ఇప్పటికే దొంగతనం ప్లాన్ చేసుకుని, ఒకరి ముఖాలను ఒకరు గుర్తించలేని క్లిష్ట పరిస్థితిలో ఉండిపోయారు. ఇలా పొగ వారి కళ్ళను, ఊపిరిని భారంగా మారుస్తుంది. భయంతో వారు బయటపడటానికి ఒక మార్గం కోసం వెతుకుతారు.
తమాషా ఏమిటంటే ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. వీడియో బయటకు రాగానే సోషల్ మీడియాలో నవ్వులు పూశాయి. ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
