February 28, 2026

వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక…!

vitika Shocking comments about Varun

Teluguwonders:

బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2 లకు భిన్నంగా సీజన్ 3 లో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సరికొత్త ప్రయోగం చేసారు. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్ వితికా షేరు ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు. వితిక వరుణ్ తో తన లవ్ స్టోరీ ఎలా ప్రారంభం అయిందో బాబా భాస్కర్ తో చెబుతుంది. వరుణ్ సందేశ్ ను ఫస్ట్ టైమ్ షూటింగ్ సమయంలో చూసినప్పుడు నా దగ్గర ఒక ఐఫోన్ ఉండేది. ఆ ఐ ఫోన్ నోట్స్ లో నేను వరుణ్ సందేశ్ గురించి రాసుకున్నానని వితిక బాబా భాస్కర్ తో చెబుతుంది.

అప్పుడు వరుణ్ సందేశ్ తో సినిమా చేయాలని నాకు లేదు. కానీ స్టోరీ నచ్చింది కాబట్టి చేస్తున్నానని అనుకున్నాను. ప్రతిరోజు షూటింగ్ సమయంలో ఏం జరుగుతుందో పాయింట్ల రూపంలో రాసేదాన్ని.

వరుణ్ సందేశ్ గురించి అందరూ అమ్మాయిలతో క్లోజ్ గా ఉంటాడని చెప్పేవారు. ఐతే వరుణ్ తో ఫస్ట్ డే షూటింగ్ ఓపెనింగ్ సీన్ గుడిలో జరిగింది. ఓపెనింగ్ సీన్ తరువాత మీడియాతో మాట్లాడే సమయంలో మీడియా వాళ్ళు హీరోయిన్ మీద చెయ్యి వెయ్యమని చెప్పారు. అప్పుడు వరుణ్ సందేశ్ నేను చెయ్యి వేయటం ఏంటి ? అని అమాయకంగా అన్నాడు అని వితిక బాబా భాస్కర్ తో చెబుతుంది.

వరుణ్ అలా అనేసరికి నేను నవ్వుకున్నాను. ఆ తరువాత 60 రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగిందని ఆ 60 రోజుల్లో వరుణ్ సందేశ్ కు తన పేరు తప్ప మరేమీ తెలియదని అస్సలు మాట్లాడేవాడు కాదని, తనతో ఎప్పుడూ ఐదుగురు ఉండేవారని బాబా భాస్కర్ తో చెబుతుంది వితిక. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కెమెరా అటాచ్ చేసి ఇద్దరినీ కారులో వెళ్ళిపొమ్మన్నారు. నేను అంతకుముందే ఒకసారి అమెరికా వెళ్ళానని అమెరికాలో ఎక్కడెక్కడికెళ్ళావు ? ఏ హీరో ఇష్టం ? అని వరుణ్ ను అడిగానని వితిక బాబా భాస్కర్ తో చెబుతుంది.

అప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము. ఆ సమయంలో వరుణ్ అమ్మ, నాన్న అమెరికాలో ఉండేవారు. వరుణ్ సందేశ్ ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. వరుణ్ ఎప్పుడు లేస్తాడో, ఎప్పుడు తింటాడో, ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం అయ్యేది కాదు. వరుణ్ షూటింగ్ కు వెళ్ళటం, నైట్ రావటం, తినటం, పడుకోవటం అది తప్ప చూసుకునేవారు లేరు. అప్పుడు తన లైఫ్ లో నేను ఉంటే బాగుంటుంది అనిపించింది. నాకు ఆ సమయంలో వరుణ్ సందేశ్ పై జాలి వేసింది. ఆ జాలి తరువాత వరుణ్ సందేశ్ ను ప్రేమించానని వితిక బాబా భాస్కర్ మరియు రాహుల్ సిప్లిగంజ్ తో చెబుతుంది. వరుణ్ సందేశ్ వితికా షేరు పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో కలిసి నటించారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading