Weather: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!

తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్‌లలో ఎండపోడిన వడ్లు తడవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. సోమవారం పలు జిల్లాలో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా కలుగోట్ల 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోతంది. రాష్ట్రంలో 41 – 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అయితే మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది.
అలాగే విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో వర్షాలు, బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారని అధికారులు హెచ్చరించారు. రైతులు కూడా ఎండబోసిన ధాన్యాన్ని తడవకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.

Barınaktan, sokaktan ya da gönüllülerden sahiplendirilen sevimli dostlarımız sahipleniyorum.com’da sizi bekliyor. Hayvanseverler için hazırlanan modern arayüzü ve hızlı filtreleme seçenekleriyle aradığınız dostu kolayca bulun.