ఏపీలో పర్యాటకానికి కొత్త మెరుగు… ఎనిమిది చోట్ల హౌస్‌బోట్లు – హాయిగా విహరించే అవకాశం!

ఎక్కడెక్కడంటే…ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకాన్ని మరింత విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రిలోని సరస్వతీ ఘాట్, పుష్కర ఘాట్, అనకాపల్లి జిల్లాలోని కొండకాకర్ల సరస్సు, సూర్యలంక, విజయవాడలోని భవానీ ద్వీపం, కడప జిల్లా గండికోట, విశాఖ జిల్లా గంభీరం, అల్లూరి జిల్లా తాజంగి రిజర్వాయర్‌లలో హౌస్‌బోట్లు నిర్వహించేందుకు ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతులు మంజూరయ్యాయి. మొత్తం మీద పలు సంస్థలు కలిపి రూ.10 కోట్ల పెట్టుబడితో ఈ హౌస్‌బోట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. ఎంపికైన పర్యాటక కేంద్రాల్లో సింగిల్, డబుల్ బెడ్‌రూం హౌస్‌బోట్లు నడపనున్నారు.
ఇటీవల విజయవాడ కృష్ణా నది మధ్యలోని భవానీ ద్వీపంలో హౌస్‌బోట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం టికెట్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇక్కడ రెండు హౌస్‌బోట్లతో పాటు రోమాంటిక్ ఫ్లోట్ బోట్, డైన్ బోట్ను కూడా ఏర్పాటు చేశారు. అదనంగా నెల్లూరు జిల్లా స్వర్ణాల చెరువు, కర్నూలు జిల్లా గార్గేయపురం, కోనసీమ ఎదుర్లంక ప్రాంతాల్లో కూడా ఇలాంటి హౌస్‌బోట్లు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
హాయిగా విహరించొచ్చు…
ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల్లో హౌస్‌బోట్లు సజావుగా నడిచేలా అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం నిర్మించనుంది. జెట్టీల ఏర్పాటు కోసం స్థల కేటాయింపులు జరుగుతుండగా, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక పర్యాటకులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో హౌస్‌బోట్లో దాదాపు ఆరుగురు సౌకర్యంగా విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే రోమాంటిక్ ఫ్లోట్ బోట్, డైన్ బోట్లలో బర్త్‌డే పార్టీలు, యానివర్సరీలు వంటి ప్రత్యేక సందర్భాలను సెలబ్రేట్ చేసుకునే వీలుంది. డైన్ బోట్లలో లంచ్, డిన్నర్ సదుపాయాలు కూడా ఉంటాయి.
భద్రతకు పెద్దపీట
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. హౌస్‌బోట్లు ఏర్పాటు చేసే ప్రతి ప్రాంతంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడ పోలీసులు సహా వివిధ శాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బోట్లను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీ చేస్తారు. నదులు లేదా రిజర్వాయర్లలో వరద ముప్పు ఎక్కువగా ఉన్నప్పుడు పర్యాటకులను అనుమతించకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయనున్నారు.
Share this:
- Share on X (Opens in new window) X
- Share on Facebook (Opens in new window) Facebook
- Share on Reddit (Opens in new window) Reddit
- Share on Pinterest (Opens in new window) Pinterest
- Share on WhatsApp (Opens in new window) WhatsApp
- Share on LinkedIn (Opens in new window) LinkedIn
- Share on Tumblr (Opens in new window) Tumblr
- More
Related
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
