అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్

దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్ ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే –
కార్వీ ఇన్‌సైట్స్ నిర్వహించిన పోల్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రెండో స్థానంలో
ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానంలో నిలిచారు.
జూలై 15-27 తేదీల మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 97 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు.
అనంతపురం: ఇండియా టుడే సర్వే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనువిప్పు కావాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలిచారని, ఆయన పనితీరు కు ఈ సర్వే కొలమానం అని పేర్కొన్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
