February 28, 2026

భీష్మ ఏ రేంజ్ బ్లాక్‌బస్టర్ అంటే… బాక్సాఫీస్ విధ్వంసం…!

bheeshma-20191108101742-18180

యంగ్ హీరో నితిన్ హిట్ కరువు తీరిపోయింది. మూడు వరుస ప్లాపుల తర్వాత నితిన్ నటించిన భీష్మ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్‌గా రు. 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు రోజులకే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రు. 11 కోట్ల రమారమీ షేర్ రాబట్టింది. ఇక ఏరియాల వారీగా భీష్మ రెండు రోజుల వసూళ్లు విశ్లేషిస్తే నైజాంలో తొలిరోజు రెండు కోట్లు వసూలు చేసింది ఓ మీడియం సినిమా అంటే చిన్న విషయం కాదు.



ఇక నైజాంలో రెండో రోజు కూడా రు. 10 లక్షలు తక్కువుగా రు. 2 కోట్ల షేర్ రాబట్టింది. ఓ మీడియం రేంజ్ సినిమా నైజాంలో ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

మూడు రోజుల్లోనే ఈ సినిమాకు కొన్న అమౌంట్ వచ్చేస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఫుల్ హ్యాపీయే. ఇక ఏపీ, సీడెడ్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. వైజాగ్ ఏరియాలో రెండు కోట్ల పాతిక లక్షల అడ్వాన్స్ మీద విడుదల చేసిన అక్కడ ఈ పెట్టుబడికి మరో రు.50 లక్షలు మాత్రమే రికవరీ కావాలి.



ఇక మూడు రోజులకే అన్ని ఏరియాల్లోనూ దాదాపు బ్రేక్ ఈవెన్ కు వచ్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నైజాం, ఓవర్సీస్లో ఈ సినిమా మూడో రోజు నుంచే భారీ లాభాల భాట పట్టనుంది. ఇటీవల కాలంలో ఇలా మీడియం సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయినది డైరక్టర్ మారుతి అందించిన ప్రతి రోజూ పండగే సినిమానే. ఇప్పుడు భీష్మ ఆ సినిమాను మించిన టాక్‌తో దూసుకు వెళుతోంది.ఇక ప్రతి రోజు పండగే సినిమాకు ముందు యావరేజ్ టాక్ వచ్చింది. భీష్మకు అలా కాదు ముందు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading