చెపాక్‌లో నూర్ అహ్మద్ తుపాన్.. కేకేఆర్‌పై సీఎస్కే విజయం!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన సీఎస్కే vs కేకేఆర్ మ్యాచ్ ఒక దశలో పూర్తిగా కోల్‌కతా వైపు వెళ్లినట్టే కనిపించింది. కానీ ఆ మ్యాచ్‌ను ఒక్కసారిగా తిప్పేసిన హీరోగా నూర్ అహ్మద్ నిలిచాడు. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్‌ను కుదిపేసి సీఎస్కేకు అద్భుత విజయాన్ని అందించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్ జట్టు ప్రారంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ కెప్టెన్ అజింక్య రహానే క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను చక్కగా నడిపించాడు. 10వ ఓవర్ వరకూ కేకేఆర్ మ్యాచ్‌లో బలంగా నిలిచింది.
అయితే 11వ ఓవర్‌లో బంతి అందుకున్న నూర్ అహ్మద్ మ్యాచ్ దిశనే మార్చేశాడు. మొదట రహానేను క్యాచ్ ద్వారా అవుట్ చేసి, వెంటనే క్రీజ్‌లోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌ను క్లిన్ బౌల్డ్ చేశాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో కేకేఆర్‌పై ఒత్తిడి పెరిగింది.
అంతటితో ఆగకుండా, డెత్ ఓవర్లలో ప్రమాదకర బ్యాటర్ రింకూ సింగ్‌ను కూడా తెలివిగా ఔట్ చేశాడు. అతనికి బౌండరీ కోసం ఆకర్షించే బంతి వేయడంతో క్యాచ్ అవుట్ అయ్యేలా చేశాడు. ఈ మూడు కీలక వికెట్లు మ్యాచ్‌ను పూర్తిగా సీఎస్కే వైపు తిప్పాయి.
నూర్ అహ్మద్‌కు తోడు అకేలా హోసెన్ కూడా మంచి బౌలింగ్ ప్రదర్శించడంతో కేకేఆర్ 20 ఓవర్లలో 160/7 స్కోర్‌కే పరిమితమైంది. దీంతో చెన్నై జట్టు 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో సీఎస్కే తమ పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకింది. మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించిన నూర్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
