Kurnool: నిన్న వెళ్లేటప్పుడు.. ఈరోజు వచ్చేటప్పుడు.. 24 గంటల్లోనే కర్నూలులో మరో బస్సు ప్రమాదం

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం మరవకముందే… మళ్లీ మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇది కూడా కర్నూలులోనే చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.
కర్నూలు బస్సు ప్రమాదం నెత్తురు ఆరకముందే మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది జీపీ ట్రావెల్స్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులంతా గాఢలో నిద్రలో ఉన్నారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొట్టింది ట్రావెల్ బస్సు. బెంగళూరు నుంచి వస్తున్న బస్సు జడ్చర్ల దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులు ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
కర్నూలు దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందంటున్నారు ప్రయాణికులు. ప్రమాదం అనంతరం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ వరకు బస్సును తీసుకురావడంతో RTA అధికారులు కేసు నమోదు చేశారు. ప్రయాణికులను ఆరంగర్ చౌరస్తా దగ్గర దింపి బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు అధికారులు.
