అవును మీరు వింటుంది నిజమే..క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారి పోతుందని తాజా పరిశోధనలో తేలింది .ఈ బిజీ బిజీ లైఫ్ లో క్యాలిక్యులేటర్ వాడకుండా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా!!! ఒకసారి గుర్తు తెచ్చుకోండి చిన్నప్పుడు మనకు బడిలో మన గురువులుఒకటి, రెండు,మూడు, నాలుగు అంటూ వేళ్ళు వాడుతూ
లెక్కలు పెట్టుకోవడం నేర్పించేవారు. కానీ మనం పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది సిగ్గుపడో ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయపడో నెమ్మదిగా ఈ అలవాటు ని వదిలేసాం, కానీ ఇదే తప్పు అంటున్నారు శాస్త్రవేత్తలు. లెక్కలు వేసేటప్పుడు చేతివేళ్లు వాడేవారికి ,క్యాలిక్యులేటర్ వాడేవారికి మధ్య మెదడు పనిచేసే విధానాన్ని వారు గమనించారు .లెక్కలు వేయడంలో క్యాలిక్యులేటర్ వాడే వారి కన్నా చేతి వేళ్లను వాడేవారికి మెదడు చురుకుగా పని చేస్తుందని వారు కనుగొన్నారు. ఎంతో పెద్ద సమస్య అయితేనే గాని క్యాలిక్యులేటర్ వాడకూడదని వారు చెబుతున్నారు .ముఖ్యంగాస్కూలుకు వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు లెక్కలు చేసుకునే
సమయంలో వారికి వేళ్ళ లెక్కలు వేసు కోవడం నేర్పాలని, లేదా నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలని పిల్లల నిపుణులు చెప్తున్నారు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే అయినా,
లెక్కలు చేసేటువంటి పద్ధతులు ఎడ్వాన్స్ అయినప్పటికీ వేళ్ళు ఉపయో
గించడంవల్ల ఫలితాలను వారికి తెలియజేయాలని ఈ విధంగా చేస్తే వారి మెదడు మరింత చురుకుగా పని చేస్తుందని ,ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వారు మేధావులుగా రూపు దిద్దుకుంటానీ వారు నొక్కి వక్కాణిస్తున్నారు ,బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చదివారుగా ఇక నుండైనా లెక్కల విషయంలో.. మీ మెదడుకు పని కల్పించి చురుకుగా ఉండనివ్వండి. ఇకనుండి పెద్ద పెద్ద సమస్యలైతేనే తప్ప క్యాలిక్యులేటర్ వాడకండి..