Kinetic Luna: మార్కెట్లలోకి సరికొత్తగా కైనెటిక్‌ లూనా

📱👩🏻‍💻 *Kinetic Luna: మార్కెట్లలోకి సరికొత్తగా కైనెటిక్‌ లూనా..!*

🔏 👉 కైనెటిక్‌ లూనా బైక్‌ గురించి తెలియని వారు ఎవరు ఉండరనుకుంటా..! 1972 సంవత్సరంలో భారత వాహన రంగంలోకి అడుగుపెట్టి సంచలనాన్ని సృష్టించింది. ఈ బైక్‌ను కైనెటిక్‌ ఇంజనీరింగ్‌ సంస్థ రూపొందించింది. 50 సీసీ ఇంజన్‌తో 30 సంవత్సరాలపాటు కైనెటిక్‌ లూనా భారత ఆటోమొబైల్‌ రంగాన్ని శాసించింది. కొన్ని రోజుల తరువాత మార్కెట్లలోకి కొత్త బైక్‌ల రాకతో కైనెటిక్‌ లూనా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో 2000 సంవత్సరంలో కైనెటిక్‌ లూనా బైక్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది.

☣️🌀 కైనెటిక్‌ మోటర్‌ సైకిల్స్‌ లిమిటిడ్‌ తన కంపెనీ షేర్లను పూర్తిగా అమ్మివేసింది. గత నెలలో కైనెటిక్‌ లూనా తిరిగి భారత మార్కెట్లలోకి వస్తోందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా కైనెటిక్‌ లూనా సరికొత్తగా ఎలక్ట్రిక్‌ బైక్‌ రూపంలో భారత ఆటోమొబైల్‌ రంగంలో తిరిగి కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్‌ లూనా ఎలక్ట్రిక్‌ బైక్‌ ఈ సంవత్సరం లాంచ్‌ జరగనుంది. భారత టూవిలర్‌ ఎలక్ట్రిక్‌ మార్కెట్లలోకి లూనా సరికొత్తగా ఎంట్రీ ఇవ్వనుందని కైనెటిక్‌ గ్రూప్‌లో భాగంగా ఉన్న మోటోరాయల్‌ ఎమ్‌డీ అజింక్యా ఫిరోడియా సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

☣️🌀 వచ్చే రెండునెలల్లో కైనెటిక్‌ లూనా భారత మార్కెట్లలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్‌ లూనా ఎలక్ట్రిక్‌ బైక్లను ఇప్పటికే అహ్మదాబాద్‌ కేంద్రంగా ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కైనెటిక్‌ లూనా బైక్‌కు స్వాపబుల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీలను అమర్చనున్నారు. కైనెటిక్‌ లూనా బైక్లకు 1kW శక్తిని అందించనుంది. ఈ బైక్‌ టాప్‌స్పీడ్‌ 25 కెఎమ్‌పీహెచ్‌. సింగిల్‌ ఛార్జ్‌తో 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్‌ను సపోర్ట్‌ను చేయనున్నట్లు తెలుస్తోంది.

☣️🌀 కైనెటిక్‌ లూనా ఎలక్ట్రిక్‌ బైక్లకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేదు. కైనెటిక్‌ లూనా బైక్‌ రెండు వేరియంట్లలో మార్కెట్లలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్‌ లూనా టూవిలర్‌, కైనెటిక్‌ లూనా త్రీవీలర్‌ లంబోర్ఘిణి బగ్గీరేంజ్‌ వేరియంట్లలో రానుంది. కైనెటిక్‌ లూనా ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర సుమారు రూ. 50 వేలకు మించి ఉండదని మార్కెటు వర్గాలు భావిస్తున్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading