Teluguwonders:
AP Grama Sachivalayam Exam Answer Keys 2019 | గ్రామ సచివాలయ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప రీక్ష ప్రాథమిక ‘కీ’ని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక కీపై సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది ‘కీ’తోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాతపరీక్షలు నిర్వహించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష నిర్వహించగా..
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10,680 పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న రాతపరీక్షలు నిర్వహించారు.
794 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకుగానూ మొత్తం 12,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు ..ఉద్యోగం:
9,886 ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఈ పోస్టులకుగానూ మొత్తం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. 5612 మంది పరీక్షకు హాజరయ్యారు. దీంతో పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు ఉద్యోగాలకు ఎంపికైనట్లే అని అధికారులు తెలిపారు.
ఉదయం నిర్వహించిన విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ప్రిలిమినరీ కీని సాయంత్రం విడుదల చేసిన అధికారులు..
మధ్యాహ్నం నిర్వహించిన ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్ష ప్రిలిమినరీ కీని రాత్రి 9 గంటల తర్వాత విడుదల చేశారు. కీపై అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబరు 9న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.