60s లో కూడా 30s లో..ఉన్నట్టుండే..మన్మధుడు నాగార్జున తాత కాబోతున్నారా ..!! అంటే సమంత చేసిన పని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది .సమంత చేసిన పనికి సోషల్ మీడియాలో నాగ చైతన్య సమంత అభిమానులు, అక్కినేని అభిమానులు ఇంకా కొంత మంది అక్కినేని well-wishers అప్పుడే శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు. సమంత నాగచైతన్యల జంట నాగార్జునను తాతను చేయబోతోంది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇలా ఈ వార్తలు రావడానికి వెనుక సమంత చేసిన ఒక చిన్నపని కారణం అయింది.
వివరాల్లోకి వెళ్తే :
🧡ఎవరు ఈ ‘బేబీ అక్కినేని’ : లేటెస్ట్ గా సమంత తన ట్విటర్ పేజీని ‘బేబీ అక్కినేని’ గా రీ నేమ్ చేసింది. దీనితో సమంత తల్లి కాబోతోందా అంటూ వార్తలు పుట్టుకు వచ్చాయి.
ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా ఈమధ్య నాగచైతన్య సమంతను ‘బేబీ’ అంటూ పిలుస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలతో సమంత తల్లి కాబోతోందా అంటూ సందేహాలు కలిగేలా చేస్తున్నాయి.
💟ఇదంతా “బేబీ” ప్రమోషన్ ..!!?
ఈ వార్తలను నాగ్ సన్నిహితులు ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న సమంత జూనియర్ అక్కినేనిని అందించే ఆలోచనలు చేయదనీ ఆవిషయానికి ఇంకా చాల సమయం ఉంది అని అంటున్నట్లు టాక్. అంతేకాదు సమంత ఇలా తన ట్విటర్ పేజీకి ‘బేబీ అక్కినేని’ అంటూ రీ నేమ్ చేయడంలో వచ్చే నెల విడుదల కాబోతున్న సమంత ‘ఓ బేబి’ ప్రమోషన్ వ్యూహాలు మాత్రమే అని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య విడుదలైన చాల రీమేక్ సినిమాలు టాలీవుడ్ లో ఫెయిల్ అయిన నేపధ్యంలో ఈమూవీ ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. సమంత హీరోయిన్ ఒరిఎంటెడ్ మూవీ ‘యూటర్న్’ కలక్షన్స్ విషయంలో ఫెయిల్ అయిన నేపధ్యంలో ‘ఓ బేబీ’ మూవీ పై క్రేజ్ పెంచి భారీ ఓపెనింగ్స్ అందుకోవడానికి సమంత తన మూవీ ప్రమోషన్ విషయంలో ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నీ అనుసరిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు సమంత అందుకున్న లేటెస్ట్ అస్త్రం ఈ ‘బేబీ అక్కినేని’ అని అనుకోవాలి.. ఒకరకంగా సమంత అక్కినేని తల్లి కాబోవడం నిజం అనుకున్నా ,పెళ్లి కాకముందటి కంటే ఇప్పుడు ఎక్కువ సినిమాల్లో జోష్ గా నటిస్తున్న సమంత ని చూస్తుంటే ఆ వార్త నిజం కాదని అనిపిస్తుంది. చూద్దాం మరి మన్మధుడు తాత కాబోతున్నాడేమో…