శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా..?!!

Spread the love

శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా..?!!

శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా.. అంటే   జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఒకప్పుడు దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో   శంకర్ పేరే మొదటిగా వినపడేది . కానీ ఇప్పుడు బాహుబలి సిరీస్ తో.. రాజమౌళి కూడా తన స్థానానికి పోటీ వచ్చేసాడు. బాహుబలి2 విజయం తర్వాత శంకర్ పోటీగా 2.0 రిలీజ్ చేశాడు. కానీ అది అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తనకు గతంలో ఎంతో పేరును తీసుకొచ్చిన భారతీయుడు సిరీస్ ని తీసి తిరిగి తన స్థానం సంపాదించడానికి శంకర్ ప్రయత్నించాడు. కానీ భారతీయుడు 2 కొన్ని సమస్యల వల్ల ఆగిపోయింది.

ఐతే అన్ని సమస్యలూ పరిష్కరించుకుని త్వరలోనే ఈ చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరిగే సూచనలు కనిపించడం లేదు. రాజమౌళి  రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ల తో RRR ప్రారంభించగానే, ఈ సినిమాను శంకర్ దాదాపుగా పక్కన పెట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. దీని బదులు RRRకి పోటీగా మరో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట శంకర్. విజయ్, విక్రమ్ హీరోలుగా ఈ చిత్రం చేయాలనుకుంటున్నాడట. విక్రమ్‌తో ‘అపరిచితుడు’ లాంటి బ్లాక్ బస్టర్‌తో పాటు ‘ఐ’ కూడా తీశాడు శంకర్. విజయ్‌తో ‘3 ఇడియట్స్’ రీమేక్ చేశాడు.

ఈ ఇద్దరు హీరోలతోనూ శంకర్‌కు మంచి అనుబంధమే ఉంది. శంకర్ కోరితే వాళ్లిద్దరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు సర్దుబాటు సినిమా చేసేస్తారనడంలో సందేహం లేదు. శంకర్ ఎప్పుడూ ఇద్దరు పెద్ద స్టార్లతో మల్టీస్టారర్ తీసింది లేదు. ఈ కాంబినేషన్లో శంకర్ సినిమా చేశాడంటే దానిపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కానీ ఇదంతా అగ్ర దర్శకుడి గా తనకున్న స్థానాన్ని కాపాడుకోవడానికే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *