అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2024 ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామని అమిత్ షా ప్రకటించారు. అంటే ఇంకా 365 రోజుల్లో శ్రీరాముడు దర్శనం మనకి కలుగుతుందన్న మాట. ఎన్నికలు జరిగే నేపథ్యంలో
సభలో అమిత్ షా ప్రసంగించారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ వారు అడ్డుకుంటున్నారు. ఈ రామ మందిర నిర్మాణానికి ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయని , కానీ సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆలయ నిర్మాణాన్నీ ప్రారంభించారని ఆయన తెలిపారు
.