4కోట్ల విలువైన కారు ను సీజ్ చేశారు

Spread the love

ఛండీఘడ్ పోలీసులు లాంబోర్గిని హ్యురాకేన్‌ను సీజ్ చేశారు. దాదాపు రూ.4కోట్ల విలువైన కారు నడిపే వ్యక్తి డ్రైవింగ్ డేంజరస్ గా ఉందని లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు కార్ ను సీజ్ చేశారు. నగర రోడ్లపై హై స్పీడుతో డ్రైవింగ్ చేయడమే కాక లైసెన్స్ చూపించమని అడిగిన పోలీస్ ముందు తెల్లముఖం వేశాడు. ప్రస్తుతం దానిని సీజ్ చేసి పోలీస్ యార్డ్ లో ఉంచారు.

ఢిల్లీలో రిజిష్టర్ అయిన ఈ కార్.. మట్కా చౌక్ బారికేడ్ వద్ద పోలీసులు రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా చెక్ చేశారు. కార్ డ్రైవర్ దురుసుగా సమాధానం చెప్పడంతో వాదన ఆగలేదు. హై స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తుండటంతో పాటు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడని పోలీసులు గమనించి కార్ ఆపారు.

ఆ సమయంలో కార్ గంటకు 150కిలోమీటర్ల వేగంతో ఉందని పోలీసులు అంటున్నారు.

కార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఒక్కటి అతని వద్ద లేవు. ప్రస్తుతం కార్ ను సెక్టార్ 28వద్ద ఐటీఐ పోలీస్ యార్డ్ లో పార్క్ చేశాం. కార్ ఇటాలికా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించింది. లాంబొర్గినీ వాహనాల డీలర్ కు చెందినదిగా గుర్తించారు.

కారుకు వేసిన చలానా అమౌంట్ ను అధికారులు వెల్లడించలేదు. దాదాపు రూ.20వేల వరకూ ఉండొచ్చని అంచనా. మ్యాండేటరీ డాక్యుమెంట్లు చూపిస్తేనే వివరాలు చెప్తారు ఒకవేళ అవి మిస్ అయ్యాయని చెప్తే ఫైన్ అమౌంట్ ఇంకా పెరగొచ్చు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తామని పోలీసులు అంటున్నారు. పోలీసులు ఆపిన సమయంలో వ్యక్తి మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *