వరుస ఓటముల తర్వాత RR రాయల్ కమ్‌బ్యాక్… LSGపై గెలుపు

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో Rajasthan Royals(RR) జట్టు అద్భుతంగా తిరిగి నిలబడుతూ ఘన విజయం సాధించింది. Lucknow Super Giants(LSG_) పై 40 పరుగుల తేడాతో గెలిచిన రాయల్స్, వరుసగా ఎదురైన రెండు ఓటముల తర్వాత బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. 160 పరుగుల లక్ష్యం పెద్దది కాదని భావించిన లక్నో, అనూహ్యంగా 119 పరుగులకే ఆలౌట్ కావడం మ్యాచ్‌లో కీలక మలుపు అయింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే లక్నో బ్యాటింగ్ పూర్తిగా కుదేలైంది. మొదటి ఓవర్ చివరి బంతికి ఆయుష్ బదోనీ రనౌట్ కావడంతో వికెట్ల పతనం మొదలైంది. తరువాతి ఓవర్‌లోనే కీలక ఆటగాడు రిషబ్ పంత్ డకౌట్ కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అయిడిన్ మార్క్రామ్ కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో లక్నో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
పవర్‌ప్లే ముగిసే సరికి లక్నో స్కోరు 31/3 మాత్రమే ఉండటం పరిస్థితిని మరింత కష్టతరం చేసింది. నికోలస్ పూరన్ కొంతసేపు పోరాడినా 22 పరుగులకే ఔట్ అయ్యాడు. హిమ్మత్ సింగ్, ముకుల్ చౌదరి వంటి ఆటగాళ్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. ఒక్క మిచెల్ మార్ష్ మాత్రమే స్థిరంగా ఆడి 55 పరుగులతో జట్టుకు ఆశ చూపించాడు. అయితే అతను ఔట్ కావడంతో లక్నో ఆశలు పూర్తిగా చల్లారిపోయాయి.
రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. జోఫ్రా ఆర్చర్ తన వేగంతో మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపు తిప్పాడు. నంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ ఇద్దరూ రెండేసి వికెట్లు తీసి లక్నో బ్యాటింగ్‌ను పూర్తిగా కుదేలుచేశారు. రవీంద్ర జడేజా, రవి భిష్ణోయ్ కూడా తమ వంతు పాత్ర పోషించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కూడా మంచి ఆరంభం చేయలేదు. యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేసి ఔట్ కాగా, ధ్రువ్ జురెల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ కూడా పెద్దగా రాణించకపోవడంతో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది జట్టు.
అయితే కెప్టెన్ రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మయర్ మధ్య భాగంలో కొంత స్థిరత్వం తీసుకువచ్చారు. ఇద్దరూ తలా 20కి పైగా పరుగులు చేసి స్కోరు పెంచారు. తరువాత డినోవన్ ఫెర్రారియా, శుభం దూబే చిన్న చిన్న ఇన్నింగ్స్‌లతో జట్టును ముందుకు నడిపించారు.
ముఖ్యంగా రవీంద్ర జడేజా ఆఖర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేసి స్కోరును 159కు తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌లో అతను చేసిన బౌండరీలు జట్టుకు బలాన్ని ఇచ్చాయి.
లక్నో బౌలింగ్‌లో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్సిన్ ఖాన్ ఇద్దరేసి వికెట్లు తీసినా, బ్యాటింగ్ వైఫల్యం కారణంగా మ్యాచ్‌ను కోల్పోయారు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సమిష్టిగా రాణించి, తక్కువ స్కోరును విజయవంతంగా కాపాడుతూ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ లోపాలతో గట్టిగా తడబడ్డాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
