షూటింగ్‌లో గరిటె పట్టిన శోభిత.. ఎంత బాగా వంట చేసిందో చూశారా? వీడియో వైరల్

తెలుగుతో పాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శోభిత ధూళిపాళ్ల. అయితే నాగ చైతన్యతో పెళ్లి నేపథ్యంలో చాలా కాలం పాటు కెమెరాకు దూరంగా ఉండిపోయింది. అయితే మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా బిజి బిజీగా ఉంటోంది శోభిత.
ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అక్క మీలో కుకింగ్ టాలెంట్ కూడా ఉందా‘ అని ఒకరు కామెంట్ చేయగా శోభత స్పందిస్తూ తనకు మూడ్ ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది చెల్లి అంటూ సమాధానం ఇచ్చింది. ఇక శోభిత షేర్ చేసిన ఈ ఫొటోలపై నాగచైతన్య కూడా స్పందించారు. ‘శోభిత చేసిన వంటలను రుచి చూడటానికి ఎదురుచూస్తున్నాను‘ అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఇప్పుడు శోభిత కుకింగ్ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
