ఇంకా వదలని వరుణుడు.. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో రచ్చరంబోలా!

దక్షిణ ఛత్తీస్గడ్ నుండి విదర్భ ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం మీదుగా ఉత్తరాకారల వరకు సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడింది. దీంతో తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2 వరకు వర్షాలు..
హైదరాబాద్, ఆగస్ట్ 30: బంగాళాఖాతంలో విదర్భ దాని పరిసరాలలో సగటు సముద్రమట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ ఛత్తీస్గడ్ నుండి విదర్భ ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం మీదుగా ఉత్తరాకారల వరకు సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడింది. దీంతో తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. శనివారం (ఆగస్ట్ 30) ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇక ఆదివారం (ఆగస్ట్ 30) ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం, మంచిర్యాల, మహాబూబాబాద్, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
ఇక గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాల్లో గాంధారి మండల కేంద్రంలో 27.4 సెంటీ మీటర్లు, సర్వాపూర్‌లో 27.4 సెంటీమీటర్ల భారీ వర్షాపాతం నమోదైంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
