Tirumala: వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం.. భక్తులకు అందుబాటులోకి వచ్చిన పుష్కరిణి

తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో స్వామి పుష్కరిణి ఈ రోజు నుంచే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులను టీటీడీ జూలై 20 న ప్రారంభించిన విషయం తెలిసిందే.
గ్యాలరీల్లో ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం.
బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు గ్యాలరీల్లో ఉన్న ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందేలా ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. గత ఏడాది గరుడ వాహన సేవకు 3 లక్షలకు పైగా భక్తులు వచ్చారని అందుకనుగుణంగా ఈ ఏడాది అదనపు ట్రిప్పులు తిప్పేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా పార్కింగ్ ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. తిరుపతిలో కూడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు.
భక్తులకు అందుబాటులోకి వచ్చిన పుష్కరిణి.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో స్వామి పుష్కరిణి ఈ రోజు నుంచే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులను టీటీడీ జూలై 20 న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్వామివారి పుష్కరిణి లోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దకంతో మరింతగా ఆకట్టుకుంటుంది. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణిని నింపిన టిటిడి అధికారులు ఈ మేరకు మరమ్మతు పనులు పూర్తిచేశారు. స్వామి పుష్కరిణి మరమ్మతు పనుల తో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపి వేసింది. ఇక భక్తులను సైతం నెల రోజులపాటు స్వామి వారి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. మరమత్తు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి పుష్కరిణీలోకి టిటిడి భక్తులను అనుమతించింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
