
బొమ్మ పడింది..!
*బొమ్మ పడింది..!* *తొమ్మిది నెలల తరువాత థియేటర్లలో సినిమా సందడి* *తరలివచ్చిన ప్రేక్షకులు.. అన్ని చోట్లా తొలిరోజు హౌస్ఫుల్* గాంధీనగర్(కాకినాడ): కరోనా నేపథ్యంలో మూత పడిన సినిమా థియేటర్లలో దాదాపు తొమ్మిది నెలల విరామం తరువాత కొత్త బొమ్మ పడింది. సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కరోనా దృష్ట్యా సినిమాహాళ్లకు జనం వస్తారా రారా.. అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా…