ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌: జీన్స్‌, టీషర్ట్‌కు నో

*ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్‌: జీన్స్‌, టీషర్ట్‌కు నో!* ముంబయి: ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం.. అలాగని చెప్పి నచ్చిన దుస్తులు వేసుకెళ్తానంటే ఇకపై మహారాష్ట్రలో కుదరదు. తాజాగా అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్‌, టీషర్ట్‌ ధరించకూడదు. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేషధారణకు సంబంధించి ఈ నెల 8న ఓ సర్క్యులర్‌ జారీ…

Read More

*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ

*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ* *ఈ నెల 21న ప్రారంభించనున్న సీఎం జగన్‌* అమరావతి: రాష్ట్రంలో భూములను రీ-సర్వే చేసేందుకు వీలుగా రాష్ట్ర సర్వే శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిని అనుసరించి జిల్లాల కలెక్టర్లు రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్‌ ఇస్తారు. తేదీల వారీగా ఏయే గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నది  ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఈ నెల 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి విడత కింద…

Read More

*3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు

*3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు..* ▫️ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్ నెట్ అనే పదం తెలియని వారు చాలా కొద్దీమంది ఉండవచ్చు. ప్రతి చిన్న దానికి ఏదైనా వెతకాలంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది ఇంటర్ నెట్‌. అందుకే రోజు రోజుకి నెట్ మీద ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ ఏడాది ఆండ్రాయిడ్ వినియోగదారులు 3.3 ట్రిలియన్ గంటలు తమ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయినట్లు ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇంటర్ నెట్ వినియోగం 25 శాతం పెరిగింది అని పేర్కొంది….

Read More

*వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్

*వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్* ▫️వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్‌ని వినియోగదారులకు పరిచయం చేసింది. గత వారం క్రితం ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు తన కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో ద్వారా తెలిపింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఛాటింగ్‌ చేసేప్పుడు ప్రతి ఛాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా వాల్‌పేపర్‌ గ్యాలరీ అప్‌డేట్…

Read More

*గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ

*గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ* ▫️శామ్సంగ్ వచ్చే నెలలో గెలాక్సీ ఎస్ 21 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. అయితే గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి SM-G991U అనే కోడ్ పేరుతో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) నుండి అనుమతి కూడా లభించినట్లు సమాచారం. ఇందులో 25వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ 9వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో…

Read More

JIO TV: జియో టీవీలో ఇంటర్‌ పాఠాలు

*JIO TV: జియో టీవీలో ఇంటర్‌ పాఠాలు.. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు ప్రసారం* కరోనా కారణంగా విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థుల కోసం ఆంద్రప్రదేశ్ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థుల కోసం జియో టీవీలో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఇంటర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు జియో టీవీ ద్వారా ఈరోజు (డిసెంబర్‌ 8) ఉదయం 6…

Read More

ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి

🏡సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాల్సిన మున్సిపాలిటీ పన్ను వివరములు…………….. ఆస్తిపన్ను ఆర్డినెన్స్‌ లోని ముఖ్యాంశాలు 1) ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి ఇప్పటివరకు ఆస్తిపన్నును అద్దెవిలువలో శాతంగా లెక్కిస్తున్నారు. -ఆంధ్ర ప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ చట్టం 1955 సెక్షన్‌ 199 ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో వార్షిక అద్దె విలువలో 15 శాతానికి తగ్గకుండా 30 శాతానికి మించకుండా ఆస్థిపన్నును నిర్ణయించాలి. -ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీస్‌ చట్టం 1965 సెక్షన్‌ 85 (2) ప్రకారం మున్సిపాలిటీల…

Read More

జులై 8 నుంచి పింఛను రూ.2,500*

*జులై 8 నుంచి పింఛను రూ.2,500* *వచ్చే మూడేళ్లూ వైఎస్‌ పుట్టినరోజునే పింఛను పెంచుతాం* *పత్రికలు, టీవీలపై ధ్వజమెత్తిన సీఎం జగన్‌* ఆంద్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజైన జులై 8 నుంచి.. పింఛను మొత్తాన్ని రూ.2,500 చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ‘2022 జులై 8 నాటికి రూ.2,750కి పెంచుతాం.. 2023 జులై 8 నాటికి రూ.3వేలు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎక్కడా మాట తప్పబోమని, చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని…

Read More

*తెరాస మేయర్‌ వ్యూహమేంటో

*తెరాస మేయర్‌ వ్యూహమేంటో?* *ఎక్స్‌అఫిషియోలతోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరమే* హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మేయర్‌ పదవి దక్కించుకోవడానికి తెరాస వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం కలిసినా తెరాస మేయర్‌ పదవిని దక్కించుకోలేదు. దీంతో ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా  లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో 99 డివిజన్లను తెరాసనే…

Read More