ఆ వేగానికి లేదుగా బ్రేక్.. ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ దెబ్బకి నోరెళ్లబెట్టిన ప్రిన్స్!

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 147.7 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతితో శుభ్‌మాన్ గిల్‌ను అవుట్ చేసి సంచలనం రేపాడు. ఇది గిల్‌ను బౌలింగ్ చేసిన మూడో సందర్భం కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తింది. గుజరాత్ టాపార్డర్ చెలరేగడంతో 217 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, రాజస్థాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ ఆటగాళ్లలో హెట్మయర్, సంజు శాంసన్ మాత్రమే నిలదొక్కుకోగలిగారు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ జోఫ్రా…

Read More

క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు లక్షలు ఖర్చు చేస్తున్న వారికి గుడ్‌న్యూస్‌! ఒక్క బ్లడ్‌ టెస్ట్‌తో..

AIIMS శాస్త్రవేత్తలు గర్భాశయ క్యాన్సర్ చికిత్స ప్రభావాన్ని గుర్తించే కొత్త రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష రక్తంలోని HPV DNA స్థాయిలను కొలుస్తుంది, ఇది కణితి పరిమాణంతో సంబంధం కలిగి ఉంటుంది. చికిత్సకు క్యాన్సర్ కణాల స్పందనను అంచనా వేయడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. ఖరీదైన స్కానింగ్ పద్ధతులకు ఇది చౌకైన ప్రత్యామ్నాయం. క్యాన్సర్‌ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చుపెడుతూ ఉంటారు. ఒక వైపు చికిత్స జరుగుతున్నా.. క్యాన్సర్‌…

Read More

Andhra Pradesh:శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేటి నుంచి మూడ్రోజులపాటు పలు సేవలకు బ్రేక్‌..!

ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకోగా, 23,699 మంది తలనీలాలు సమర్పించారు.   తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజులపాటు…..

Read More

Gold Price Record: వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు.. తులంపై..

Gold Price Record: బంగారం ధరలు తగ్గుతాయని, తులం బంగారం ధర కేవలం రూ.55 వేలకు చేరుకోవచ్చని భావిస్తున్న తరుణంలో తాజాగా మరోసారి రికార్డ్‌ స్థాయిలో ఎగబాకింది. ప్రస్తుతం బంగారం ధర రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. తులం బంగారంపై ఏకంగా 3000 వరకు పెరిగి రికార్డ్‌ సృష్టించింది.. గత వారం రోజుల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు రికార్డ్‌ సృష్టించింది. ఏప్రిల్‌ 10న ఉదయం 6 గంటల సమయానికి స్వల్పంగా పెరిగిన బంగారం…

Read More

Jack Movie Twitter Review: జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హిట్టు కొట్టరా..?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన సినిమా జాక్. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బేబీ…

Read More

IPL 2025 Purple Cap: బెంగళూరు, గుజరాత్ మ్యాచ్‌తో మారిన పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ ప్లేస్ ఎవరిందంటే?

IPL 2025 Purple Cap Standings After RCB vs GT: చిన్నస్వామి స్టేడియంలో గుజారత్ టైటాన్స్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. జోస్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు. జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. IPL 2025…

Read More

AP Rains: అటు ఎండ, ఇటు వాన.. ఏపీలో తాజాగా చిత్రవిచిత్ర వాతావరణం.

ఒకవైపు వాన, మరోవైపు ఎండ.. ఏపీలో తాజాగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పగా.. అటు కొన్ని చోట్ల ఎండలు కూడా ఠారెత్తిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

Read More

Dulquer Salman: దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా ?.. అంతకు ముందు ఎలా ఉన్నాడంటే..

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళీ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హీరోగా తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరో చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మమ్ముట్టి నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు…

Read More

Warangal Chapata Chilli: వరంగల్ మిర్చికి అరుదైన ఘనత.. చపాటకు జీఐ ట్యాగ్‌..స్పెషల్ ఏంటంటే..

ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉండటం వల్ల GI గుర్తింపు లభించిందని.. కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ నుంచి ధ్రువీకరణ పత్రం అందిందని ఆయన వెల్లడించారు. వరంగల్ చపాటా మిర్చికి GI గుర్తింపు లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓరుగల్లు పేరు మరోమారు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు వ్యవసాయ ఉత్పత్తులు జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఓరుగల్లు చిల్లీ..వరంగల్ చపాటా…

Read More